ఎంసెట్ ఫలితాలు విడుదల

111
sabitha

ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌ 2020 ఫలితాలు విడుదలయ్యాయి. కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్టీయూ క్యాంప‌స్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌ పరీక్ష రాసిన వారిలో 89,734 మంది(75%) ఉత్తీర్ణత సాధించారు. eamcet.tsche.ac.in లో అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది ఎంసెట్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో అధికారులు ఎంసెట్ పరీక్షను నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 102 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంసెట్‌ పరీక్షలకు 1,43,326 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,19,183 మంది హాజరు అయ్యారు.