టిల్లు స్వ్కేర్..వసూళ్ల జోరు

24
- Advertisement -

2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 23.7 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక రానున్న రెండు రోజులు వీకెండ్ కావ‌డంతో ఈ మూవీకి క‌లెక్ష‌న్ల్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల సాంగ్స్​, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ అందించారు. ప్రిన్స్, మురళిధర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

Also Read:IPL 2024 :కోహ్లీ పైనే భారమా?

- Advertisement -