దేశాన్ని గెలిపించాలనే ఉద్దేశంతోనే ఆడాను అని భారత క్రికెటర్ తిలక్ వర్మ తెలిపారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన తిలక్… పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడికి గురయ్యాం అన్నారు.
ఆ సమయంలో ఎమోషనల్ అయితే ఆటను ఆడలేం… దేశాన్ని తలుచుకుని స్థిరంగా ఆలోచించి, బాగా ఆడేందుకు ప్రయత్నించానని చెప్పారు. పాకిస్థాన్ ఆటగాళ్లు చాలా ఒత్తిడికి గురిచేసినప్పటికీ, ఏమీ పట్టించుకోకుండా లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. మ్యాచ్‌ను గెలిపించి వారికి సరైన జవాబివ్వాలనే ఉద్దేశంతో ఆడానని స్పష్టం చేశారు. ఆసియాకప్ ఫైనల్‌లో చేసిన బ్యాటింగ్ తన కెరీర్‌లోనే చాలా విలువైందని అన్నారు.
జట్టు మొత్తం సమష్టిగా కష్టపడ్డాం…. పాక్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చాలా ఒత్తిడిలోనే నేను బ్యాటింగ్ చేశాను. దేశాన్ని గెలిపించాలన్న లక్ష్యంతో ఆడాను అన్నారు. తన విజయంలో తల్లిదండ్రులు, కోచ్‌ది ప్రముఖపాత్రని తిలక్ వర్మ చెప్పారు. వారు తన క్రికెట్ కెరీర్ కోసం చిన్నప్పటి నుంచి ఎంతో కృషి చేశారని చెప్పారు.
Also Read:మద్యం,మాంసం ప్రియులకు షాక్

