ఆగని ట్రంప్ టారీఫ్ బాంబ్!

10
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చాడు. తాజాగా కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత మోగించారు. కలప పై 10 శాతం, కిచెన్ క్యాబినెట్‌లు , అప్‌హోల్‌స్టర్డ్‌ ఫర్నిచర్‌ పై 25 శాతం సుంకాలను ప్రకటించారు. ఈ టారిఫ్‌లు అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.

ఇప్పటికే భారత్ టార్గెట్‌గా టారీఫ్ బాంబును పేల్చారు ట్రంప్. అలాగే అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

విదేశాలలోని పోటీదారులు అమెరికన్‌ సినీ వ్యాపారాన్ని కొల్లగొడుతున్నారని ట్రంప్‌ తెలిపారు. పసిబిడ్డ నుంచి చాక్లెట్‌ చోరీ చేసిన విధంగానే ఇతర దేశాలు అమెరికా సినీ నిర్మాణ వ్యాపారాన్ని చోరీ చేస్తున్నాయి అని ట్రంప్‌ ఆరోపించారు.

Also Read:కాంతార చాప్టర్ 1..టికెట్ రేట్ల పెంపు

- Advertisement -