టిక్ టాక్ స్టార్ దారుణ హత్యకు గురైంది. 17 ఏళ్ల టిక్ టాక్ స్టార్ సానా యూసుఫ్ ను ఇస్లామాబాద్ లోని తన ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కల్చర్, లైఫ్‌స్టైల్, యువత సాధికారతపై 17 ఏళ్ల సానా యూసుఫ్ తరచూ టిక్‌టాక్‌లో వీడియోలు పెడుతూ ఉంటుంది.
పోలీసులు దీన్ని పరువు హత్యగా భావిస్తున్నారు. ఈ టీనేజ్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసే వీడియోలు తెగ వెరల్ అవుతున్నాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడి కాల్పులకు తెగబడిన అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరార్ అయ్యాడు.
సనా యూసఫ్ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్ అనే ప్రాంతానికి చెందిన అమ్మాయి. టిక్‌టాక్ వీడియోల ద్వారా ఆమె చాలా పాపులర్ అయ్యింది. ఇన్‌స్టాలో ఆమెకు 5 లక్షలకుపైగా ఫాలోవర్ల ఉన్నారు.
Also Read:నా మాటలను అపార్థం చేసుకున్నారు!

