గోల్ఫ్ లెజెండ్ టైగర్ వుడ్స్ (50) ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ (DUI) అనుమానంపై అరెస్టయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు అధిక వేగంతో రెసిడెన్షియల్ రోడ్డుపై వెళ్తూ ఒక ట్రక్కును ఢీకొని పల్టీలు కొట్టి పక్కకు తిరిగిపోయింది.
ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. కారు ప్రమాదానికి గురైనప్పటికీ, టైగర్ వుడ్స్ ప్రయాణికుల వైపు తలుపు ద్వారా బయటకు వచ్చారని అధికారులు తెలిపారు. ఆశ్చర్యకరంగా, ఆయనకు పెద్దగా గాయాలు కాలేదని వెల్లడించారు.
వుడ్స్‌లో మత్తు లక్షణాలు కనిపించాయని చెప్పారు. బ్రెత్ అనలైజర్ పరీక్షలో మద్యం ఆనవాళ్లు లభించలేదని, కానీ యూరిన్ టెస్ట్‌కు ఆయన నిరాకరించడంతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఫ్లోరిడా చట్టాల ప్రకారం, బెయిల్ పొందే ముందు కనీసం 8 గంటలు జైలులో ఉండాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
Also Read:జుట్టు ఊడిపోవడం…పరిష్కారం!
ఇది టైగర్ వుడ్స్‌కు రెండో DUI కేసు. 2017లో కూడా ఆయన ఇలాంటి కేసులో అరెస్టయ్యారు. ఆ సమయంలో పెయిన్‌కిల్లర్స్ మిశ్రమం వల్లే అలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పిన విషయం గుర్తించదగ్గది. ఇది వుడ్స్‌కు నాలుగో కారు ప్రమాదం. 2021లో లాస్ ఏంజెల్స్‌లో కూడా ఆయన SUV రోడ్డు నుంచి జారి ప్రమాదానికి గురైంది.
ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే మాస్టర్స్ టోర్నీకి ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

