బడ్జెట్ పుస్తకాల గందరగోళంపై జగదీష్ రెడ్డి

4
- Advertisement -

రాష్ట్ర బడ్జెట్ ప్రక్రియలో తీవ్రమైన నిర్లక్ష్యం చోటుచేసుకుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. డిమాండ్ బుక్, అవుట్‌కమ్ బడ్జెట్ బుక్‌లు ఒకేలా ముద్రించబడటం ప్రభుత్వ పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. డిమాండ్ బుక్స్‌లో అవుట్‌కమ్ బడ్జెట్‌ను ముద్రించడం ఎంత పెద్ద తప్పిదమో ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా ప్రభుత్వం నడుస్తుంది? ఇది ప్రభుత్వం కాదు సర్కస్‌లా ఉంది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనలో అధికారుల బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. బడ్జెట్ వంటి కీలక పత్రాల విషయంలో ఇలాంటి పొరపాట్లు అసహ్యకరమని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి తన బాధ్యతలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఈ తప్పును వెంటనే సరిదిద్దుకొని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.గతంలో సాధించిన ఫలితాలు, ఈ ఏడాది గ్రాంట్లపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని జగదీష్ రెడ్డి అన్నారు. అవుట్‌కమ్ బడ్జెట్ మరియు ఈ ఏడాది గ్రాంట్స్ బుక్ ఒకేలా ఉండటం ప్రభుత్వ ప్రణాళికలో లోపాలను చూపిస్తోందని పేర్కొన్నారు.

Also Read:జుట్టు ఊడిపోవడం…పరిష్కారం!

పవిత్రమైన అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుల విషయంలో ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైంది కాదని ఆయన హెచ్చరించారు. ఇది సాధారణ పొరపాటు కాదు, నేరం. ఈ అంశంపై సభలో మాట్లాడుతాను అని స్పష్టం చేశారు. ఉన్నది ఉన్నట్లుగా రెండు వేర్వేరు పుస్తకాలు తయారు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఎలా నడుస్తోంది? అంటూ జగదీష్ రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు.

- Advertisement -