బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు.. వారిని రాజస్థాన్‌లోని కోటా నుంచి ముంబైకి తరలించేందుకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. మూడు ఇన్నోవా కార్లు, పలుమార్లు మారిన ప్రయాణ మార్గాలు, మూడు రాష్ట్రాల మీదుగా సాగిన ఈ ప్రయాణంలో పోలీసులు భద్రతకు పెద్దపీట వేశారు. సుమారు 900 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 16 గంటల్లో అధిగమించి నిందితులను ముంబైకి తీసుకువచ్చారు.
ముంబైలోని జుహూ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం టైగర్ ష్రాఫ్ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా.. ఆయన డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ కేసులో హృతిక్ కుమార్ అలియాస్ రోషన్ (22), రేహాన్ (18), ఫూల్ సింగ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు బిహార్‌కు చెందినవారు కాగా, మరో ఇద్దరు హర్యానాకు చెందినవారు. వీరిని అక్టోబర్ 19న రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్లో పుణె–జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసుల సమాచారంతో రాజస్థాన్ పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. అనంతరం నిందితులను ముంబై పోలీసులకు అప్పగించారు.
Also Read:జైలర్ 2@రూ.541 కోట్లు
కాల్పుల అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. వారు ఉపయోగించినట్లు భావిస్తున్న మోటార్‌సైకిల్‌ను అంధేరి ప్రాంతంలో వదిలేశారు. అనంతరం రైలు, క్యాబ్ వంటి రవాణా మార్గాలను ఉపయోగిస్తూ గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకుని, అక్కడి నుంచి జైపూర్ వైపు వెళ్లే రైలెక్కినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

