రవితేజ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. దర్శకుడు వంశీ కృష్ణ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ప్రీమియర్ షోల నుండే పాజిటివ్ టాక్ వస్తుండటంతో రవితేజ మరో హిట్ కొట్టాడు. ట్విట్టర్‌లో సినిమా చూసిన నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్‌తో రవితేజపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
సినిమా ఒక రేంజ్ భయ్యా.. కేక అంతే అని కామెంట్లు పెట్టేస్తున్నారు. రవితేజ మాస్ ఎంట్రీ అదిరింది.. స్క్రీన్ ప్రజెన్స్ కేక అని చెబుతున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే అదిరింది… బీజీఎం అయితే వేరే లెవెల్లో ఉందని చెబుతున్నారు నెటిజన్లు. రవితేజ కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని…ఫైట్స్ సినిమాకు మరింత ప్లస్‌గా మారాయని చెబుతున్నారు.
యాక్షన్ పీరియడ్ డ్రామా అదిరింది.. సినిమా చాలా కొత్తగా ఉందని మరికొంతమంది చెబుతున్నారు.సినిమా అద్భుతంగా ఉందని…. హీరో కారెక్టర్‌ను చివరి వరకు కూడా డార్క్‌గా, నెగెటివ్‌గానే పెట్టడం బాగుంది అని చెబుతున్నారు. మొత్తంగా పాజిటివ్ టాక్ రావడంతో రవితేజ 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read:ఎలక్షన్ రిపోర్ట్ ; ఇక్కడ సత్తా చాటేదెవరు?