టైగర్ నాగేశ్వరరావు…అప్‌డేట్

43
tiger
- Advertisement -

వరుస సినిమాలతో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు మాస్ మహారాజా రవితేజ. చేతిలో మూడు సినిమాలు ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్ గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లో నటించనున్నారు. రవితేజ కెరీర్‌లో ఇది 71వ చిత్రం. అంతేగాదు రవితేజ కెరీర్‌లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. ఈ భారీ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. హిందీలో కూడా విడుదల కానున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించనున్నారు.

తాజాగా Tiger Nageswara Rao ప్రీ లుక్‌కి సంబంధించిన వివరాలను వెల్లడించారు దర్శకుడు వంశీ. ఏప్రిల్ 2న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు అదే రోజున 12 గంటలకు సినిమా ప్రీ-లుక్ ను కూడా రివీల్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఈ పాన్-ఇండియన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు.

- Advertisement -