కేజీఎఫ్‌ 2 @ U/A

94
kgf2
- Advertisement -

కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్‌ 2. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇటీవల విడుదలైన “కేజీఎఫ్ 2” ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు సంఖ్యలో వ్యూస్ ను కొల్లగొడుతోంది.

ఏప్రిల్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. ఇక 2 గంటల 48 నిమిషాల 06 సెకన్లు లాక్ చేశారు. అంటే సినిమా దాదాపు 3 గంటల పాటు సాగుతుందన్న మాట.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -