టైగర్‌ నాగేశ్వరరావు..సెన్సార్‌ రివ్యూ

26
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. కాగా, ఈ సినిమా రన్‌టైం 3 గంటల 02 నిమిషాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా సెన్సార్ రివ్యూ విషయానికి వస్తే.. రవితేజ నటన అద్భుతంగా ఉంటుంది. దీనికితోడు ఈ సినిమాలో రవితేజ డైలాగ్ లు కూడా అద్భుతంగా ఉన్నాయట. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో రవితేజ డైలాగ్ లే మెయిన్ హైలెట్ అట. అన్నిటికి మించి రవితేజ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడట.

రవితేజ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చేలా దర్శకుడు వంశీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. రవితేజ – రేణు దేశాయ్ మొదటి సారి కలుసుకునే సన్నివేశం కూడా గూస్ బంప్స్ వస్తాయట. అలాగే ట్రైన్ లో రవితేజ చేసే ఫైట్ కూడా సినిమాలో మరో ప్రధాన హైలైట్ కానుంది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీల నుండి ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాలో నార్త్ ఇండియాకి సంబంధించి కొన్ని పొలిటికల్ అంశాలను టచ్ చేశారట. ఈ చిత్రంలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read:షర్మిల.. బ్యాక్ టూ ఆంధ్రా?

అక్టోబర్ 20న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి విడుదల కానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కానీ, ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ జీవిత కథ ఆధారంగా రాబోతుంది. ఈ సినిమాలో అటు ఎమోషన్స్ ను, ఇటు యాక్షన్ ను సమపాళ్లలో బ్యాలెన్స్ చేశారు. రవితేజ లో.. యాక్షన్ హీరోను కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో దర్శకుడు వంశీ హండ్రెడ్డ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడట. చూస్తుంటే ర‌వితేజ ఈసారి ద‌స‌రాకు పెద్ద హిట్ కొట్టేట్లున్నాడు.

Also Read:సైంధవ్ సాలీడ్ అప్‌డేట్!

- Advertisement -