ఓటిటిలోకి ‘థగ్ లైఫ్’!

8
- Advertisement -

ఉలగనాయకన్ కమల్ హాసన్ ఇండియన్ సినిమా లివింగ్ లెజెండ్. 6 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో కల్ట్ క్లాసిక్ విజయాలతో, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్తగా అద్భుతమైన సినిమాలని అందించాలనే తపనతో పని చేస్తున్నారు. తన అద్భుతమైన విజన్, రైటింగ్, డైరెక్షన్ తో అశేషమైన ప్రేక్షకాదరణ పొందిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం. కమల్ హాసన్, మణిరత్నం 37 సంవత్సరాల క్రితం నాయకన్/నాయకుడు లాంటి ఆల్-టైమ్ క్లాసిక్‌ని అందించారు. మూడు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి ‘థగ్ లైఫ్’ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చారు.

నటుడు శింబు కూడా సాలిడ్ పాత్రలో నటించిన ఈ సినిమా అనుకున్న రెస్పాన్స్ ని అందుకోలేక డే 1 కే ప్లాప్ టాక్ తో డిజాస్టర్ అయ్యింది. దీంతో ఓటీటీలోకి త్వరగానే వచ్చేసింది థగ్ లైఫ్.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ నిర్మాణం వహించారు.

Also Read:రూ.4 లక్షల భరణం చెల్లించాల్సిందే!

- Advertisement -