మక్కళ్ నీది మయ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు కమల్ హాసన్. అన్నివర్గాల వారిని ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తునే…బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తునే ఉన్నారు. మోడీ ప్రవేశపెట్టిన జీఎస్టీపై కొంతకాలంగా విమర్శలు కురిపిస్తున్న కమల్..తాజాగా జీఎస్టీని చెత్త బుట్టలో పడేయాలని సంచలన కామెంట్ చేశారు.
జీఎస్టీ , నోట్ల మార్పిడి(రద్దు)ని తప్పుబట్టిన కమల్…నేను ప్రధానమంత్రి అయిఉంటే జీఎస్టీని చెత్త బుట్టలో పడేసేవాడినని తెలిపారు. జీఎస్టీపై మలేషియాలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని తెలిపారు.
తన పార్టీకి క్రిస్టియన్ మిషనరీల నుంచి నిధులు వస్తున్నాయన్న వార్తలు నిరాధారమైనవని చెప్పుకొచ్చారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు నవ్వొస్తుందని పస లేని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్ధానాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన కమల్.. ఆదిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.