త్రినాథరావు నక్కిన…ప్రొడక్షన్ నెం.2 లాంచ్

17
- Advertisement -

స్టార్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్స్ తీయడంలో దిట్ట, తన గత చిత్రం ‘ధమాకా’తో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందించిన ఆయన తన బ్యానర్ నక్కిన నేరేటివ్స్‌లో ప్రొడక్షన్ నెం 2ను అనౌన్స్ చేశారు. ఆంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విక్రమ్ సహిదేవ్ లగడపాటి హీరోగా నటిస్తుండగా, వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.వి.ఎస్.ఎస్. సురేష్ సహ నిర్మాత.

బ్లాక్‌బస్టర్ సినిమా చూపిస్తా మావ తర్వాత త్రినాధరావు నక్కిన మరో అద్భుతమైన కథను రాశారు. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన విక్రమ్ సహిదేవ్ లగడపాటి హీరోగా కూడా తన సత్తాను నిరూపించుకోకున్నారు. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా లాంచింగ్ వేడుకను జరుపుకుంది. త్రినాథరావు,నాయుడు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తం షాట్ కు సందీప్ కిషన్ క్లాప్‌ కొట్టగా, శరత్ మరార్ కెమెరా స్విచాన్ చేశారు. సుమంత్ తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.

సూపర్ హిట్ ఫ్రాంచైజీ దృశ్యం చిత్రంలో వెంకటేష్ కుమార్తెగా కనిపించిన ఎస్తేర్ అనిల్, విక్రమ్ సహిదేవ్ లగడపాటి సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, తారక్ పొన్నప్ప కీలక పాత్రలో కనిపించనున్నారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉండబోతున్న ఈ చిత్రానికి ఈగిల్ ఫేమ్ దావ్‌జాంద్ సంగీతం అందిస్తుండగా, మాయ వి. సినిమాటోగ్రఫర్. ప్రవీణ్ పూడి ఎడిటర్, రఘు కులకర్ణి ప్రొడక్షన్ డిజైనర్. నరేష్ తుల, రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్ రాయగా, త్రినాధ రావు నక్కిన, నరేష్ తుల, ఉదయ్ భాగవతుల స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

మూవీ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. ఈ చిత్రం నక్కిన నేరేటివ్స్‌ ప్రొడక్షన్ నెం.2. దీనికి టైటిల్ ఖరారు చేశాం. త్వరలోనే ప్రకటిస్తాం. నేను చాలా స్ట్రగుల్ అయి ఈ స్థాయికి వచ్చాను. నాలాగే ఎంతోమంది స్ట్రగుల్ అవుతుంటారు. వాలందరికీ నా శక్తికి తగ్గ ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. దీనికి నా స్నేహితులు, మిత్రులు సపోర్ట్ తో నక్కిన నేరేటివ్స్‌ నిర్మాణ సంస్థని స్థాపించాను. సినిమా చూపిస్తా మామ వరకూ నేనే కథలు రాసేవాడిని. తర్వాత రాయలేదు. నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, ధమాకా మా ప్రసన్న రాశారు. ఐతే ఈ సినిమా కోసం మళ్ళీ కథ రాశాను. ఇది కల్ట్ లవ్ స్టొరీ. టౌన్ లో జరిగే అందమైన ప్రేమకథ. ఇందులో విలన్ పాత్ర కూడా చాలా కీలకమైనది. కథ అద్భుతంగా వచ్చింది. నాతో పాటు నరేష్ , ఉదయ్ భాగవతుల స్క్రీన్ ప్లేలో, నరేష్ , రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్ లో పని చేశారు. దర్శకుడు వంశీ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇందులో విక్రమ్ పాత్ర అదిరిపోతుంది. విక్రమ్ కి జోడిగా ఎస్తర్ చేస్తున్నారు. తనలో చాలా ప్రతిభ వుంది. పొన్నప్ప మరో కీలకమైన పాత్రలో కనిపిస్తారు. దేవ్ జాంద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ గా వుంటుంది. ప్రముఖ సాంకేతిక నిపుణులతో సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నాం. దర్శకుడిగా ప్రేక్షకులు నన్ను గొప్పగా ఆదరించారు. నిర్మాతగా ఇప్పుడే అడుగులు వేస్తున్నాను. దీనికి కూడా పెద్దపీట వెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఇందులో పని చేస్తున్న అందరికీ మంచి పేరు రావాలి” అని కోరారు.

దర్శకుడు వంశీ కృష్ణ మల్ల మాట్లాడుతూ…త్రినాధరావు నక్కిన గారికి ధన్యవాదాలు. ఆయన చాలా ప్రేమించి రాసుకున్న కథని నా చేతిలో పెట్టారు. వందశాతం కష్టపడి ఆయన అనుకున్నదాని కంటే బెటర్ అవుట్ పుట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఎక్కడా రాజీపడకుండా పెద్ద టెక్నిషియన్స్ తో సినిమాని నిర్మిస్తున్నందుకు త్రినాధరావు గారికి ధన్యవాదాలు. మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుంచి మొదలుపెడుతున్నాం. అనకాపల్లి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తాం. త్రినాధరావు గారు లాంటి పెద్ద దర్శకులు నన్ను నమ్మి సినిమా ఇచ్చారు. ఆయనకి రుణపడి వుంటాను. ఇది మామూలు సినిమా కాదు. ఎక్స్ ట్రార్డినరీ గా వుంటుంది. విక్రమ్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత పెద్ద కమర్షియల్ హీరో అవుతాడు. ఎస్తేర్ పాత్ర కూడా చాలా అద్భుతంగా వుంటుంది. తారక్ పొన్నప్ప పాత్ర కూడా కీలకంగా వుంటుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఎవరూ వూహించలేని జోనర్ ఇది. దావ్‌జాంద్ నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు” అన్నారు.

Also Read:KTR:కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు

హీరో విక్రమ్ సహిదేవ్ లగడపాటి మాట్లాడుతూ.. త్రినాధరావు నక్కిన గారి ప్రొడక్షన్ లో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు . మీ అందరి ఆశీస్సులు కావాలి.’ అని కోరారు.హీరోయిన్ ఎస్తేర్ అనిల్ మాట్లాడుతూ.. దృశ్యం తర్వాత మరోసారి మీ ముందుకు రావడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’ తెలిపారు.

- Advertisement -