దుబాయ్‌కి చేరిన కేకేఆర్…

250
kkr
- Advertisement -

ఐపీఎల్ ప్రారంభానికి కౌంట్ డౌన్ దగ్గరపడుతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి టోర్ని ప్రారంభంకానుండగా కరోనా నిబంధనల మేరకు అన్ని ప్రాంఛైజీలు సిద్ధమయ్యాయి.

ఇక భారత్‌లో కరోనా టెస్టులు పూర్తిచేసుకున్న కోల్ కతా నైట్ రైడర్స్,రాజస్ధాన్ రాయల్స్ ఆటగాళ్లు దుబాయ్ చేరుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాయి ఇరు జట్ల యాజమాన్యాలు.

దుబాయ్‌కి చేరిన ఆటగాళ్లు పీపీఈ కిట్స్‌, మాస్కలు ధరించి ఉండగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దుబాయ్ కి బయలుదేరి వెళ్లనుంది. యూఏఈలోని ‘దుబాయ్, షార్జా,అబుదాబి వేదికల్లో ఐపీఎల్ జరగనుంది. 51 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్ లు జరగనున్నాయి.

- Advertisement -