అమెరికాలో కొనసాగుతున్న ఆందోళనలు…

218
america
- Advertisement -

ఆఫ్రికన్‌ – అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమెరికాలోని 40కి పైగా ప్రధాన నగరాల్లో నిరసనజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కర్ఫ్యూ విధించినా లెక్కచేయకుండా నిరసనకారులు వేలాదిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పలు షాపులు లూటీకి గురికాగ పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు ఆందోళన కారులు. వచ్చారు.

జార్జి కుటుంబానికి న్యాయం జరగాలని, అతడి హత్యకు కారకులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు. నిరసన కారులను అదుపు చేసేందుకు పోలీసులు రబ్బరు బులెట్లను, బాష్ప వాయువును ప్రయోగించారు. ఈ నిరసనల్లో అమెరికాలోని పలువురు సెలబ్రిటీలు, పాప్ సింగర్లు, మోడల్స్ కూడా పాల్గొన్నారు.

ఆఫ్రికన్‌ – అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ని పోలీసులు అమానుషంగా కాల్చి చంపారనేది ప్రధాన ఆరోపణ. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ విజృంభణతో కుదేలవుతున్న అమెరికాకు ఈ నిరసనలపర్వం కొత్త తలనొప్పిగా మారింది.

- Advertisement -