బీజేపీలో ఓ ఈటెల రాజేంద్ర మరియు విజయశాంతి మధ్య వివాదం ముదురుతోందా ? అసలు ఈ ఇద్దరి మధ్య వివాదానికి కారణం ఏంటి ? ఈ ఇద్దరి రగడ పార్టీ పై ప్రభావం చూపే అవకాశం ఉందా ? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈటెల రాజేందర్ ప్రస్తుతం చేరికల కమిటీ చైర్మెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విజయశాంతి బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
తాజాగా ఈటెల రాజేంద్ర టార్గెట్ గా విజయశాంతి చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ హీట్ పెంచుతున్నాయి. బీజేపీలో ఇప్పటివరకు చేరికల ద్వారా ఎలాంటి విజయాలు దక్కలేదని, వ్యాఖ్యానించిన రాములమ్మ జిహెచ్‌ఎంసి, దుబ్బాక ఎన్నికల విజయంలో కూడా కార్యకర్తలదే ప్రధాన పాత్ర అని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. చేరికల కమిటీతో ఎలాంటి ఉపయోగం లేదనే విధంగా విజయశాంతి వ్యాఖ్యానించడంతో ఈటెలను ఉద్దేశించే ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈటెల టార్గెట్ గా రాములమ్మ ఘాటుగానే స్పందించిన సంగతి తెలిసిందే.
Also Read: KTR:దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
అన్నీ పార్టీలలో మాదిరి బీజేపీలో కూడా కోవర్ట్ లు ఉన్నారని ఈటెల రాజేంద్ర చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. బీజేపీలో కోవర్ట్ లు ఉండరని.. ఒకవేళ ఉంటే పేర్లు బయటపెట్టాలని ఈటెలను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు రాములమ్మ అప్పటి నుంచి వీరిద్దరి తరచూ ఏదో ఒక సందర్భంలో వివాదం కొనసాగుతూనే ఉంది. చేరికల కమిటీ చైర్మెన్ గా ఈటెల రాజేంద్ర పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారనే మాట సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చేరికల పేరు చెబుతూ మీరు ( ఈటెల ) చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం నిలవదంటూ ఈటెలను ఉద్దేశించి కాస్త ఘాటుగానే ట్విట్టర్ లో రాసుకొచ్చారు విజయశాంతి. మరి ఈ ఇద్దరి మధ్య వివాదానికి బీజేపీ అధిష్టానం ఎలా బ్రేక్స్ వేస్తుందో చూడాలి.
Also Read: బ్రహ్మణ సదనం ప్రారంభం నేడే..
చేరికల కమిటీ పేరు చెప్తూ, చిట్ చాట్ లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం ఎన్నటికి నిలవదు
ఇది హరీష్ రావు గారికి తెలవంది కాదు..
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 30, 2023