తూచ్.. నేను అలా అనలే ; బాలయ్య !

76
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ ఇటీవల వీరసింహరెడ్డి సక్సస్ ఈవెంట్ లో ఎస్వీ రంగరావు, అక్కినేని నాగేశ్వరరావు పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ” ఆ రంగరావు.. ఈ రంగరావు.. అక్కినేని.. తొక్కినేని ” అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక అక్కినేని వారసులు అఖిల్, నాగచైతన్య లు కూడా బాలయ్య వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇక టీడీపీ కాపునాడు బాలయ్య చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. వెంటనే క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం జారీ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున మాత్రం ఇంతవరకు స్పందించలేదు..

ఇదిలా ఉంచితే తాజా కాంట్రవర్సీ పై బాలయ్య వివరణ ఇచ్చారు. ” అక్కినేని నాగేశ్వరరావు తనకు బాబాయ్ లాంటి వారని, ఆయనను కించపరిచేలా తాను మాట్లాడలేదని బాలయ్య చెప్పుకొచ్చారు. సక్సస్ మీట్ లో యాదృచ్చికంగా వచ్చిన మాటలే తప్పా.. ఉద్దేశపూర్వకంగా తాను అలా అనలేదని బాలయ్య స్పష్టం చేశారు. ఇండస్ట్రీకి ఎన్‌టి రామరావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళలాంటి వారని, నాన్న గారి నుంచి క్రమశిక్షణ, నాగేశ్వరరావు గారి నుంచి పొగడ్తలకు దూరంగా ఉండే గుణం నేర్చుకున్నానని బాలయ్య అన్నారు.

బాలయ్య ఇచ్చిన వివరణతో ఈ కాంట్రవర్సీకి తెరపడినట్లైంది. అయితే గతంలో కూడా బాలయ్య, నాగార్జున మద్య కోల్డ్ వార్ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ మద్య nagarjuna క్లారిటీ ఇచ్చారు. బాలయ్య,తాను మంచి స్నేహితులమని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని నాగార్జున గతంలో చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా యాదృచ్చికంగా అక్కినేని పై వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలపై అక్కినేని వారసులు స్పందించడంతో ఈ కాంట్రవర్సీ కాస్త పెద్దదైంది. మొత్తానికి తన వ్యాఖ్యలపై బాలయ్య వివరణ ఇవ్వడంతో అక్కినేని కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

అక్కినేని ఫ్యాన్స్ ధర్నా

బాలయ్య భామకు భారీ ఆఫర్స్!

మూడో పెళ్ళికి కారణం అప్పులే

- Advertisement -