ఫిబ్రవరి 1న తొలి ప్రేమ…ట్రైలర్

268
- Advertisement -

మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలొచ్చినా.. తొలిసారి ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేం అంటూ వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. కాగా, ఫిబ్ర‌వ‌రి 9న ఈ సినిమా విడుదల కానుంది.

ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసేందుకు రెడీ అవుతోంది చిత్రయూనిట్. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, ప్రియదర్శిని, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ హృదయానికి హత్తుకునే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కిందని అన్నారు. వరుణ్ తేజ్ తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, న్యూ లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నాడని తెలిపాడు.

Tholiprema

- Advertisement -