ఫస్ట్‌ లవ్‌…ఎప్పటికి మర్చిపోలేం

152
Tholi Prema Official Teaser

‘ఫిదా’తో మంచి హిట్ అందుకున్న వరుణ్ తేజ్ .. తన తదుపరి సినిమాను వెంకీ అట్లూరితో చేస్తున్నాడు. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘తొలిప్రేమ’అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

ఇప్ప‌టికే చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ లో వేగం పెంచారు. ఇక తాజాగా చిత్ర టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. మ‌న జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వ‌చ్చిన ఫ‌స్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎన్న‌టికి మ‌ర‌చిపోలేం అనే డైలాగ్ మాత్ర‌మే టీజ‌ర్‌లో ఉంది. ఇక వ‌రుణ్ తేజ్ ఈ చిత్రంలో డిఫ‌రెంట్ లుక్‌తో క‌నిపిస్తాడ‌ని టీజ‌ర్‌తో క‌న్‌ఫాం అయింది.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, క‌రుణాక‌ర‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అంద‌మైన ప్రేమ క‌థా చిత్రం తొలి ప్రేమ‌. అప్ప‌ట్లో ఈ చిత్రం సంచ‌ల‌నాలు సృష్టించింది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో వరుణ్ తేజ్‌ వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఫిబ్ర‌వ‌రి 9న సినిమా రిలీజ్ చేయ‌నున్నారు.

Tholi Prema Official Teaser | Varun Tej | Raashi Khanna | Thaman S | Venky Atluri | #TholiPrema