గుడ్ లక్ ‘భాగమతి’..

343
Bhaagamathie Movie Teaser
- Advertisement -

అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు. అనుష్కపై ప్రశంసలు కురిపించాడు. “ప్రతి సినిమాలో కొత్తగా కనిపించేందుకు అనుష్క ప్రయత్నిస్తూనే ఉంటుంది. గుడ్ లక్ స్వీటీ. గుడ్ లక్ యూవీ క్రియేషన్స్” అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతోపాటు ‘భాగమతి’ టీజర్ ను కూడా అప్ లోడ్ చేశాడు.

అనుష్క టైటిల్‌పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భాగమతి’. జి.అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌లో అనుష్కభయంకరమైన గెటప్‌ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పుడు టీజర్‌లో.. ఓ కోటను చూపిస్తూ అందులో ఓ వ్యక్తి కాలు పెట్టగానే వస్తువులు కదులుతున్నట్లు చూపించారు. అనుష్క తన చేతిని తానే సుత్తితో కొట్టుకోవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

Bhaagamathie Movie Teaser

యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉన్ని ముకుందన్‌, ఆది పినిశెట్టి, జయరాం, ఆశా శరత్‌ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రం తర్వాత అనుష్క ఇలాంటి థ్రిల్లర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

- Advertisement -