ఈ వారం ఓటీటీ, థియేటర్‌లో వచ్చే సినిమాలను ఓసారి పరిశీలిస్తే.. సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం మజాకా. ఈ సినిమాకు మాస్ మహారాజ రవితేజతో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు త్రినాధరావు తెరకెక్కిస్తున్నాడు. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళ నటుడు ఆది పినిశెట్టి, కోలీవుడ్ దర్శకుడు అరివళగన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘శబ్దం’.ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అగాథియా’. గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఐసరి గణేష్ నిర్మాత. రాశీఖన్నా కథానాయిక. ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిత్య, ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘తకిట తదిమి తందాన’. రాజ్ లోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎల్లో మాంగో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చందన్ కుమార్ కొప్పుల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాల వివరాలను పరిశీలిస్తే..
నెట్‌ఫ్లిక్స్
డబ్బా కార్టెల్ (సిరీస్) ఫిబ్రవరి 28
అమెజాన్ ప్రైమ్
జిద్దీ గర్ల్స్ (సిరీస్) ఫిబ్రవరి 27
హౌస్ ఆఫ్ డేవిడ్ (సిరీస్) ఫిబ్రవరి 27
సుడల్2 (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 28
Also Read:ఇంటర్నెట్ ధరలపై సుప్రీం కోర్టు
జియో హాట్‌స్టార్
సూట్స్ ఎల్ ఏ: (హాలీవుడ్) వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 24
బీటిల్ జ్యూస్ : (హాలీవుడ్) ఫిబ్రవరి 28
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ : (మలయాళం)ఫిబ్రవరి 28
ది వాస్ప్ (హాలీవుడ్) : ఫిబ్రవరి 28

