‘గుంటూరు కారం’కు ఈ వారమే కీలకం

25
- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘గుంటూరు కారం’. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. ఐతే, బాక్సాఫీస్ దగ్గర మాత్రం సాలిడ్ కలెక్షన్స్ నే రాబడుతుంది. గుంటూరు కారం సినిమాకు 8వ రోజున కూడా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.79 కోట్ల షేర్, రూ. 3.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడం విశేషం. ఇక ‘గుంటూరు కారం’ సినిమా ఏపీ, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 83.10 కోట్ల షేర్, రూ. 126.80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

మొత్తం రూ. 133 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 8 రోజుల్లో రూ. 110.90 కోట్ల షేర్ వచ్చింది. ఎలాగూ ఈ వారం పెద్ద సినిమాలేవీ బరిలోకి దిగడం లేదు కాబట్టి, కచ్చితంగా ఈ వారం కూడా గుంటూరు కారం సినిమాకి బాగానే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అనుకున్న విధంగా కలెక్షన్స్ వస్తే.. ఈ వారం కలెక్షన్స్ తో గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ అవుతుంది. మొత్తంగా చూసుకుంటే.. ‘గుంటూరు కారం’కు ఈ వారమే అత్యంత కీలకం కానుంది. మరోవైపు మహేశ్‌ – నమ్రతల ముద్దుల కుమార్తె సితార మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది.

కొన్ని రోజుల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా సితార పేదింటి పిల్లలకు సైకిళ్లను పంపిణీ చేసింది. అయితే, తాజాగా సితార అనాధ పిల్లలతో కొంత సమయం గడిపి.. తన తండ్రి నటించిన గుంటూరు కారం సినిమా చూపించింది. హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌లో వారికోసం సితార స్పెషల్‌ షో ఏర్పాటు చేసింది. సితార నిజంగా మంచి మనస్సు చాటుకున్నట్లే. ఇక ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో గుంటూరు కారం మూవీ రానుంది. వచ్చే నెల 9న స్ట్రీమ్ కానుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read:Pawan:రామకార్యం అంటే ప్రజా కార్యం..

- Advertisement -