ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్లు!

16
- Advertisement -

మనం ఆరోగ్యంగా ఉండాలనే శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం చాలా అవసరం. విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు.. ఇవన్నీ కూడా మన ఆరోగ్య పరిరక్షణలో ఎంతో ముఖ్యమైనవి. వీటిలో ఏ ఒక్కటి తగ్గిన ఆరోగ్య పరంగా ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా విటమిన్లు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నేటి రోజుల్లో విటమిన్ల లోపం కారణంగానే అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందువల్ల మన శరీరంలో ఏ ఏ విటమిన్ ఎలాంటి పనితీరు కనబరుస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి విటమిన్లలో కొన్నిటి గురించి తెలుసుకుందాం !

విటమిన్ సి
ఇది మన శరీరంలో అత్యంత ముఖ్యమైనది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది సహాయ పడుతుంది. గాయాలను నయం చేయడంలోనూ, వ్యాధులను, రోగలను తగ్గించడంలోనూ ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా శరీరంలోకి ప్రవేశించే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ వంటివాటిని నిర్మూలించి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది నిమ్మ, బత్తాయి, ఆరెంజ్, కివీ వంటి వాటిలో లభిస్తుంది

విటమిన్ డి
ఇది ఎముకల దృఢత్వాన్ని పెంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇంకా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, రోగనిరోధక వ్యవస్థను వృద్ది చేయడంలోనూ సహాయ పడుతుంది. పురుషులలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ను సమతుల్యంగా ఉంచడంలో కూడా డి విటమిన్ సహాయ పడుతుంది. ఇది ముఖ్యంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది.

విటమిన్ కె
రక్తాన్ని గట్టకట్టించడంలో ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే ఏదైనా గాయం బారిన పడినప్పుడు రక్తం బయటకు రావడం సహజం. అయితే రక్తం ఎక్కువగా బయటకు పోవడం వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి రక్తాన్ని బయటకు పంపకుండా గడ్డ కట్టెలా చేయడంలో కె విటమిన్ ఎంతో ముఖ్యమైనది. అంతేకాకుండా చిగుళ్ళ సమస్యలు, దంత సమస్యలను కూడా విటమిన్ కె దూరం చేస్తుంది. ఇది ఎక్కువగా క్యాబేజీ, బచ్చలి కూర, సోయాబిన్, చీజ్, వంటి వాటిలో లభిస్తుంది.

Also Read:Gold Rate:రికార్డు స్థాయికి జంప్

విటమిన్ ఇ
జుట్టు సంరక్షణలో ఇది ఎంతో ముఖ్యమైనది. జుట్టును బలపరచడంలోనూ, చర్మ సమస్యలను దూరం చేయడంలోనూ సహాయ పడుతుంది. ఇంకా ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి శరీరంలోని టాక్సీన్లను బయటకు పంపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. విర్తమిన్ ఇ ఎక్కువగా గుమ్మడి గింజలు, బీట్ రూట్, సపోటా, వంటి వాటిలో అధికంగా లభిస్తుంది.

వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్ వంటివి ఆరోగ్య సంరక్షణలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇవన్నీ సమృద్దిగా శరీరానికి లభించినప్పుడే ఎలాంటి ఆరోగ్య సమస్యలు దారిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -