కొద్ది రోజులుగా వాట్సప్ లో వైరలవుతున్న వీడియో ఇది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడానికి కారణం క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, యూవరాజ్ సింగ్. మొదటగా ఆ వీడియో ను విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఆ తర్వాత.. శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ కూడా తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో షేర్ చేయడంతో ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజుల నుంచి తెగ హల్ చల్ చేస్తుంది.
వీడియోలో ఏముందంటే వయసు 5 లోపే ఉన్న ఓ చిన్నారి.. వన్.. టూ.. త్రీ.. ఫోర్.. ఫైవ్… అంటూ నేర్చుకోవడం.. మధ్యలో టూ బదులు త్రీ అనడం.. దీంతో కోపంతో చిన్నారి అమ్మ మందలించడం.. ఏడ్చుకుంటూ.. బాధ పడుతూ… తప్పక… మళ్లీ… త్రీ నయి యే ఫోర్ అనడం.. మళ్లీ.. ఫైవ్ అనడం నెటిజన్లకు కంటతడి పెట్టించింది. అయ్యే.. ఇంత చిన్న వయసులోనే ఈ చిన్నారికి ఏందీ చదువు తిప్పలు అని అనుకున్నాం. ఇంత చిన్న వయసులోనే ఆ చిన్నారికి ఇంత బాధ అవసరమా అని కామెంట్లు నెటిజన్ల నుంచి వచ్చాయి. పిల్లలు చదవాలంటూ వాళ్ల మీద ఒత్తిడి తేస్తే.. భయపెడితే ఎవరూ చదవరు. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమ, ఆప్యాయతతో దగ్గరికి తీసుకోవాలని క్రికెటర్లు చెబుతున్నారు.