ఈఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం ప్రజల విజయమన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం సాయంత్రం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రైతులు, మైనార్టీలు, దళితులు ఇలా కులాలకు అతీయుతంగా సకల జనులు నిండుగా దీవించి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారన్నారు. 3నెలల పాటు ఈవిజయానికి సహకరించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలను ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కోటి ఎకరాలు పచ్చబడటమే తన లక్ష్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను ఒక మాట చెప్పిన..ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే కాళేశ్వరం, మహాకూటమి గెలిస్తే శనేశ్వరం అని చెప్పారు.
చాలా కాలాంగా దళితులు, గిరిజనుల మధ్య ఉన్న భూవివాదాలను తొందర్లనే పరిష్కరిస్తామన్నారు. ఈసందర్భంగా రాష్ట్రంలోని అన్ని కులాలను ఆదుకుంటామని చెప్పారు. తప్పకుండా యువతకు ఉపాధి కల్పిస్తాం. నిరుద్యోగులు కొంచెం నిరాశగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే తప్పకుండా ఖళీగా ఉన్న భర్తీలన్నింటిని పూర్తి చేస్తామని హామి ఇచ్చారు.ప్రభుత్వేతర రంగాల్లో కూడా ఉద్యోగాలిప్పిస్తామన్నారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా దూసుకపోవాలి. త్వరలోనే ఇయన్ టీ డాక్టర్లు కూడా ఉర్లలోకి వస్తారన్నారు.
మైనార్టీల కోసం ఇండియాలో ఏ రాష్ట్రం చేయని విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టామని చెప్పారు. తెలంగాణకు అతిపెద్ద బాధ దళితులు. సంవత్సరాలు గడిచినా దళితుల బాధలు పోవడం లేదు అందుకోసం కడియం శ్రీహారి గారి ఆధ్వర్యంలో ఓ కమిటి వేసి వారిని ఆదుకుంటాం. రెడ్డి, వెలమ కులాల్లో ఉన్న పేదలకు కూడా ఆదుకుంటాం. వారికోసం కూడా రెడ్డి కార్పోరేషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు.ఎన్నికల్లో ఎలాంటి లోపం లేకుండా, గోడవలు లేకుండా పూర్తయ్యాయన్నారు.
ఇందుకు సహకరించిన ఎన్నికల అధికారి రజత్ కుమార్ కు , ఎన్నికల అధికారులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. దేశ రాజకీయాల్లో కూడా మార్పు రావాలి. జాతీయ రాజకీయాల్లో తప్పకుండా ప్రధానమైన పాత్ర పోషిస్తాం. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాకు ఫోన్ చేసి దేశ రాజకీయాల గురించి చర్చించారు. ఈదేశంలో 100శాతం నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పాలన రావాలి.
.