కేటీఆర్‌కు సినీ ప్రముఖుల ప్రశంసలు..

318
KTR
- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఘన విజయం సాధించారు. 87,565 ఓట్ల మెజార్టీతో కేటీఆర్ విజయ కేతనం ఎగురవేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో 75 సీట్లలో విజయం సాధించిన టీఆర్ఎస్.. మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ అలాగే నాచ్యురల్‌ స్టార్‌ నాని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

KTR

నాని ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినందుకు సోద‌రుడు కేటీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు టీఆర్ఎస్‌కు ఓటు వేసి త‌మ వంతు బాధ్య‌త‌ను పూర్తి చేశార‌ని, ఇక వారి సంక్షేమానికి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పాటు ప‌డాల‌ని నాని కోరాడు.

ఇక మంచు మనోజ్‌ స్పందిస్తూ.. ‘కేటీఆర్ అన్నా.. ఒక్క బుల్లెట్‌తో అంతమందా? ఈ దెబ్బ గుర్తుండిపోతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. గతంలో లాగే ఇకపై కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -