గుండెపోటుకు సంకేతాలివే..!

69
- Advertisement -

నేటి రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అద్యయానాలు దాని ప్రకారం ప్రతి పది మందిలో కనీసం ఇద్దరు హార్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారట. మరి ఈ స్థాయిలో గుండె పోటు మరణాలు నమోదు కావడానికి కారణం.. గుండెపోటు లక్షణాలను ముందుగానే అంచన వేయలేకపోవదామని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి హార్ట్ ఎటాక్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే గుండెపోటు మరణాలను కొంతలో కొంతైనా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. .

కాగా గుండెపోటు లక్షణాలు స్త్రీలలోనూ పురుషులలోనూ వేర్వేరుగా ఉంటాయట. సాధారణంగా గుండెపోటుకు ముందు తేలికపాటి ఛాతీనొప్పి, భుజాలు, మెడ, వీపు వంటి భాగాలు బరువుగా అనిపించడం నొప్పి కలవడం, శ్వాస సరిగా ఆడకపోవడం, చెమటలు, తీవ్రమైన ఆందోళన, తలనొప్పి, వాంతులు లేదా వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు స్త్రీపురుషులలో వేర్వేరుగా ఉంటాయి. మగవారిలో ఛాతీనొప్పి, హృదయ స్పందనలో మార్పులు రావడం, విపరీతమైన భయం ఆందోళనతో పాటు మైకం కమ్మినట్లుగా కూడా ఉంటుంది.

Also Read:నీట్‌ స్కామ్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌

ఇంకా ఎడమవైపు భుజం నుంచి కాలు వరకు నొప్పి, తిమ్మిరిగా ఉండడం ఇవి కూడా గుండెపోటుకు సంకేతాలే. ఇంకా ఆ సమయంలో అజీర్తి, కడుపునొప్పి కూడా గుండెపోటు లక్షణలే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఆడవారిలో తీవ్రమైన అలసట, నిద్ర భంగం, శ్వాస ఆడకపోవడం, ఛాతీ భాగంలో సూదులతో గుచ్చినట్లు నొప్పి రావడం ఎడమవైపు దవడ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి స్త్రీపురుషులు ఈ లక్షణాలను ముందుగానే పసిగట్టి ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం. కాబట్టి పై లక్షణాలను ప్రతిఒక్కరూ దృష్టిలో ఉంచుకొని గుండెపోటు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:నీ దారే నీ కథ..రిలీజ్ ఫిక్స్

- Advertisement -