తెలంగాణకు శాపంగా కాంగ్రెస్ పాలన తయారైందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణకు నీళ్ళు లేకున్నా ఆంధ్రాకు నీళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? చెప్పాలన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్.. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్ళు తీసుకపోతుంటే రేవంత్ రెడ్డి తమాషా చూసుకుంట కూర్చున్నాడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ 666 టీఎంసీల నీళ్ళు వాడుకోవాలి కానీ ఇప్పటికే 657 టీఎంసీల నీళ్ళు వాడుకుంది, మిగిలింది 9 టీఎంసీలు మాత్రమే.. కానీ ఈరోజు కూడా అక్రమంగా నీళ్ళు పోతున్నాయి .. తెలంగాణకు 343 టీఎంసీల నీళ్ళు రావాలి కానీ వాడుకున్నది కేవలం 220 టీఎంసీలు మాత్రమేనన్నారు. తెలంగాణకు 123, ఆంధ్రాకు 9 టీఎంసీల నీళ్ళు మొత్తం కలిపి 132 టీఎంసీలు కావాలి కానీ నాగార్జునసాగర్, శ్రీశైలంలో కలిపి 100 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.. దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తీసుకుపోతుందన్నారు.
మనకు రావాల్సిన మిగితా నీళ్ళు ఎక్కడి నుండి తెస్తావ్ రేవంత్ రెడ్డి ?… తెలంగాణ రాష్ట్ర హక్కులను ఏపీకి తాకట్టు పెట్టింది కాంగ్రెస్ సర్కార్ అని మండిపడ్డారు.కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతుంటే..రేవంత్ రెడ్డికి చంద్రబాబును నిలదీసే దమ్ము లేదు, కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తెలంగాణ ప్రజల పాలిట పెను శాపంలా మారిందన్నారు.
సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించి నాగార్జున సాగర్ ను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఇప్పటి వరకు తీర్మానం అమలు చేయలేదు .. రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల తెలంగాణకు నీటి విషయంలో పెద్ద మోసం జరుగుతుందన్నారు.
Also Read:ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం..

