మొబైల్ లో ఈ సీక్రెట్ కోడ్స్ తెలుసా?

29
- Advertisement -

నేటి రోజుల్లో మొబైల్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరిగా ఉంటుంది. మొబైల్ లో మన వ్యక్తిగత డేటా తో పాటు బ్యాంకింగ్ వివరాలు, ఇతరత్రా డాక్యుమెంట్లు.. ఇలా అన్నీ కూడా భద్రపరుచుకుంటూ ఉంటాము. అయితే ఏదో ఒక సందర్భంలో మన ఫోన్ ఇతరులకు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో వారు మన మొబైల్ లో ఏం ఏం చేశారు. ఏ ఏ యాప్స్ యూస్ చేశారు అని తెలుసుకోవడం కష్టం. అయితే ## 4636## కోడ్ ఉపయోగించి మొబైల్ లో ఇతరులు ఏం చేశారు తెలుసుకోవచ్చు. .

ఈ కోడ్ ఎంటర్ చేయగానే రీసెంట్ ఉపయోగించిన యాప్స్, కాల్స్, మెసేజ్ లు,.. ఇలా ప్రతిదీ కూడా ఎంత సమయం వరకు యూస్ చేశారనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో కాల్ ఫార్వార్డింగ్ స్కామ్ లు పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మనకు వచ్చే కాల్స్, మెసేజ్ లు… వంటి వాటిని ఇతరులు తెలుసుకుంటూ ఉంటారు. ఇలా తెలుసుకొని బెదిరింపులకు పాల్పడుతుంటారు. అలాంటి సమయంలో *#61# అనే కోడ్ ఉపయోగించి మనకు వచ్చే కాల్స్ ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు.

ఒకవేళ ఫార్వర్డ్ అవుతున్నట్లు చూపిస్తే ##002# కోడ్ ఉపయోగించి కాల్ ఫార్వార్డింగ్ ను బ్లాక్ చేయవచ్చు. కాబట్టి మొబైల్ ను ఇతరులకు ఇచ్చిన తర్వాత ఒకసారి ఈ కోడ్స్ ఎంటర్ చేసి మన మొబైల్ ఎంతవరకు సేఫ్ గా ఉందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిఒక్కరు పైనా సూచించిన కోడ్స్ ను తప్పనిసరిగా మొబైల్ లో సేవ్ చేసుకోవాలని చెబుతున్నారు టెక్ నిపుణులు. అలాగే తెలియని వారికి ఫోన్ ఇచ్చేటప్పుడు కూడా వారికి అవసరమైన వాటికి మాత్రమే పర్మిషన్ ఇచ్చి మిగిలిన వాటిని లాక్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఫోన్ విషయంలో ఇలాంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే భద్రతా పరమైన లోపాలు జరగకుండా ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Also Read:IND vs ENG : భారీ ఆధిక్యంలో భారత్ !

- Advertisement -