ఫ్యాన్సీ నెంబర్ 0001 @ రూ.16 లక్షలు

265
This number sold for Rs 16 lakh
- Advertisement -

ఫ్యాన్సీ నెంబర్ కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.16 లక్షలు చెల్లించి వార్తల్లో నిలిచాడు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన ఈ-వేలంలో ప్రైవేటు హాస్పిటాలిటీ పామ్‌ ల్యాండ్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని ఈ నంబర్‌ను సొంతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తె…

వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆర్‌టీవో కేటాయించే నంబర్‌ ప్రత్యేకంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. వీటికోసం ఆన్ లైన్‌లో ఆయా నంబర్ల పేరిట డబ్బు చెల్లిస్తారు. మరీ ప్రత్యేకమైన నంబర్లకు కాస్త డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. వీటికోసం వేలు కాదు లక్షలు పోసి మరి సొంతం చేసుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు. దీనికి   ‘0001’ అనే కారు నంబర్‌ వేలంలో రూ.16లక్షలు పలకడమే ఇందుకు నిదర్శనం.

0001 నంబర్‌ కోసం మొత్తం 30మంది బిడ్డింగ్‌ వేశారు. ఈ 30మందిలో రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు. చివరకు ప్రైవేటు హాస్పిటాలిటీ యజమాని దీన్ని దక్కించుకున్నారు. ఇలా ‘0001’ నెంబర్‌ కోసం వరుస కట్టడం ఇదేమి కొత్త కాదు. 2014 సెప్టెంబర్‌లో జరిగిన వేలంలో ఈ సిరీస్‌ నంబర్‌ రూ.12.50లక్షలకు, 2015లో రూ.12.10లక్షలకు దక్కించుకున్నారు.

ఇలా 29 ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా గత ఆర్నెల్లలో ఢిల్లీ ఆర్టీఏకి రూ.54.70 లక్షల ఆదాయం సమకూరింది. గతేడాది 151 నెంబర్లకు గానూ రూ.2.29కోట్లు ఆర్జించాం. రోజు రోజుకూ వీటికి డిమాండ్‌ పెరుగుతోంది. ఈ సారి దీపావళికి ఇది మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని సిటీ ట్రాన్స్‌పోర్ట్‌ స్పెషల్‌ కమిషనర్‌ కెకె దహియా తెలిపారు.

కేరళలో సైతం ఓ వ్యక్తి కెఎల్ 01 సిబి 1 ఫ్యాన్సీ నెంబర్  కోసం ఏకంగా రూ. 18 లక్షలు చెల్లించి రికార్డుల్లోకి ఎక్కాడు. తిరువనంతపురానికి చెందిన ఫార్మసీ యజమాని కేఎస్ బాల‌గోపాల్ కోటి ఖరీదైన తన టయోటా ల్యాండ్ క్రూజ్ కోసం ఇంతపెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్నాడు.

- Advertisement -