ఆ లుక్కేంట్రా?…పుడింగువా..? ఫ్యాన్స్‌పై బరితెగించిన బాలయ్య

298
Balayya Angry on Fans
- Advertisement -

సినిమా హీరోలంటే ఎవ్వరికైనా వెర్రి ఆనందమే. ఎందుకంటే తమ అభిమాన నటులను తెరవేల్పులుగానే కాకుండా తమను  తామే మైమరిచేంతగా అభిమానిస్తుంటారు. తమ హోదాని, స్థాయిని పక్కన పెట్టేసి పాత రోజుల్లో ఆటోగ్రాఫ్‌ల కోసం, ఆ తర్వాత ఫోటోగ్రాఫ్‌ల కోసం, ఇప్పుడు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. కానీ తాము ఇంతగా అభిమానించే వారు ఇలా ఉంటారా అని తెలిసి నివ్వెరపోతుంటారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌పై అసహనం వ్యక్తం చేస్తూ పరుష పదజాలంతో దూషించగా తాజాగా నందమూరి హీరో బాలయ్య సైతం తన నోటికి పనిచెప్పి తాము రిల్ హీరోలమేనని రియల్ హీరోలము కాదని నిరూపించారు.

తాజాగా నందమూరి బాలకృష్ణ  ‘పైసా వసూల్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఆ సమయంలో కొంత మంది అభిమానులు బాలయ్యతో ఫోటో తీయించుకోవాలని ఎంతో ఆశతో వచ్చారు.  తనతో ఫోటోలు దిగేందుకు వచ్చిన అభిమానులను కసురుకుంటూ, జడిపిస్తూ, చిర్రుబుర్రులాడారు.

తన అభిమాన సంఘం నుంచి వచ్చిన వారితో ఫోటో దిగుతూ..ఓ వక్తిపై వారి తాలూకు కాదని తెలిసి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన పక్కన ఫోటో కోసం వచ్చిన వ్యక్తీ మీతో పాటా అన్నారు..కాదు అనగానే పో బైటికి అంటూ నెట్టేసిన బాలయ్య..ఎదురుగా ఉన్న మరో వ్యక్తితో   ఆ లుక్కేంట్రా.. నువ్వేమైనా పుడింగివా కొడితే ఐపోతావ్ అంటూ  వార్నింగులు కూడా ఇచ్చేశాడు సిని పంథాలో. బాలయ్య తీరుతో సదరు ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలయ్య తీరుపై నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు. గతంలో సెల్ఫీ దిగడానికి వచ్చిన అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య …అభిమాని ఖరీదైన సెల్‌ ఫోన్‌ను పగులగొట్టాడు. తాజాగా మరోసారి ఫ్యాన్స్‌పై తన అసహనాన్ని ప్రదర్శించాడు.

- Advertisement -