గ్రౌండ్‎మెన్‎కు మ‌ర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ధోని….

213
- Advertisement -

త‌న ఆట‌తీరుతోనే కాకుండా.. త‌న వ్య‌క్తిత్వంతోనూ అంద‌రిని ఆక‌ట్టుకుంటాడు టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని. ఈ మిస్ట‌ర్ కూల్ చెన్నై జ‌ట్టుకు కెప్టెన్‎గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సీజ‌న్‎లో చెన్నై వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది.

This is what MS Dhoni gifted Pune Groundsmen

చెన్నైలో కావేరి జ‌లాల వివాదం కార‌ణంగా చెన్నై మ్యాచ్‎ల‌ను పుణెకు త‌ర‌లించారు. చెన్నైలో కేవ‌లం ఒక్క మ్యాచ్ మాత్ర‌మే ఆడారు. మిగ‌తా ఆరు మ్యాచ్‎లు పుణెలోనే జ‌రిగాయి. పుణె గ్రౌండ్ కూడా చెన్నై టీంకు బాగానే క‌లిసొచ్చింది. ఈ గ్రౌండ్‎లో ఆడిన ఆరు మ్యాచ్‎ల‌లో ఐదు విజ‌యాలు అందుకుంది.

నిన్న పంజాబ్‎తో జ‌రిగ‌న మ్యాచ్‎లోనూ విజ‌యం సాధించింది. అతి త‌క్కువ స‌మ‌యంలో గ్రౌండ్‎ను మ్యాచ్‎ల‌కు సిద్ధం చేస్తున్న గ్రౌండ్‎మెన్‎కు మ‌రిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. చెన్నై టీం త‌ర‌పున ఒక్కొక్క‌రికి రూ.20 వేల న‌గ‌దుతోపాటు, త‌న‌తో దిగిన ఫోటోను కూడా ఫ్రేమ్ క‌ట్టించి ఇచ్చాడు ధోని.

వెంట‌వెంట‌నే మ్యాచ్‎లు ఉన్న‌ప్ప‌టికీ.. అతి త‌క్కువ స‌మ‌యంలో గ్రౌండ్‎ను సిద్దం చేసిన సిబ్బందికి త‌మ‌కు తోచిన స‌హాయం చేశామ‌ని  చెన్నై టీమ్ మేనేజ్‎మెంట్ స‌భ్యుడు తెలిపారు. పంజాబ్‎తో జ‌రిగిన మ్యాచ్ అనంత‌రం ధోని గ్రౌండ్ మెన్‎ను క‌లిసి ఈ గిఫ్టులు అందించాడు.

- Advertisement -