కే‌సి‌ఆర్ రెండు చోట్ల పోటీ చేయడానికి కారణమిదే ?

54
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ గెలుపే లక్ష్యంగా ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తాజాగా తొలి జాబితా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అధికార ప్రదాన్యత కలిపించారాయన. ఇదిలా ఉంచితే గత కొన్నాళ్లుగా అధినేత కే‌సి‌ఆర్ పోటీ చేస్తే స్థానంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈసారి ఎన్నికల్లో కే‌సి‌ఆర్ గజ్వేల్ నుంచి కాకుండా కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతారని, కుదిరితే రెండో చోట్ల నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని ఇలా రకరకలుగా వార్తాలు వినిపించాయి. కాగా ఆ విషయంపై కూడా నేడు క్లారిటీ వచ్చింది. అందరూ ఊహించినట్లుగానే కే‌సి‌ఆర్ గజ్వేల్ మరియు కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నాట్లు స్పష్టం చేశారు.

అయితే ఇప్పుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న కే‌సి‌ఆర్‌ రెండు చోట్ల పోటీ చేయడం వెనుక అసలు వ్యూహామేంటి అని.. కాగా ఉత్తర తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ కొంత బలహీనంగానే ఉంది. దాంతో నేరుగా సి‌ఎం కే‌సి‌ఆర్.. ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఏదో ఒక నియోజిక వర్గం నుంచి పోటీచేస్తే పార్టీకి బలం చేకూరుతుందని అందుకే కే‌సి‌ఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగబోతున్నారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కామారెడ్డి నియోజిక వర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ రెడ్డికి వేరే ఇతర పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో 100 పైగా స్థానాలను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్న బి‌ఆర్‌ఎస్.. అందుకోసమే రాష్ట్రంలో అన్నీ వైపులా బి‌ఆర్‌ఎస్ గాలి వీచేలా గట్టి ప్రణాలికలతో ముందుకు సాగుతున్నారు.

Also Read:ఇచ్చిన ప్రతిహామీ జగన్ నెరవేర్చారా..మరి వాటి సంగతేంటి?

- Advertisement -