Dhoni:ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్?

39
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఐపీఎల్ లో మాత్రమే తన ఆట కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ధోని తన సారథ్యంలో తిరుగులేని జట్టుగా నిలిపారు. ఐపీఎల్ హిస్టరీలోనే ఏ జట్టుకు సాధ్యం కానీ రికార్డులను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నమోదు చేసిందంటే దానికి కారణం కేవలం ఎం‌ఎస్ ధోనీ కెప్టెన్సీనే. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు సార్లు టైటిల్ ఛాంపియన్ గా నిలవగా పది సార్లు ఫైనల్ చేరిన జట్టుగా చెన్నై రికార్డ్ సృష్టించింది. ఇక 14 ఐపీఎల్ సీజన్లలో ఏకంగా 12 సార్లు ఆ జట్టు ప్లే ఆఫ్ కు చేరిందంటే ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరి ఈ స్థాయిలో జట్టును పటిష్టంగా మార్చిన ఎం‌ఎస్ ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2023 ఐపీఎల్ సీజన్ లోనే ధోనీ ఐపీఎల్ కు గుడ్ బై చెబుతాడనే గుసగుసలు వినిపించాయి. పైగా ఆ సీజన్ లో చెన్నై కప్పు గెలవడంతో ధోనీ రిటర్మెంట్ ఖాయమని భావించారంతా కానీ అలా జరగలేదు. ఈసారి ఐపీఎల్ లో ధోని పాల్గొంటాడని కన్ఫర్మ్ కావడంతో చెన్నై అభిమానుల ఆనందానికి అవదులు లేవు. అయితే 2024 ఐపీఎల్ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ ఆడడం దాదాపు కష్టమే అంటున్నారు క్రీడా వాదులు. ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ ప్లేయర్స్ లలో మోస్ట్ సీనియర్ ఆటగాడు ధోనీ మాత్రమే. ఈ నేపథ్యంలో వయసు రీత్యా ధోనీ పూర్తిస్థాయిలో క్రికెట్ కు విరామం పలికే అవకాశం ఉందనేది కొందరి వాదన. మరి 2024 ఐపీఎల్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తారా లేదా మరికొన్ని సీజన్లు కొనసాగుతారా అనేది చూడాలి.

Also Read:ప్రజాపాలన నిర్వహిస్తున్నాం:సీఎం రేవంత్

- Advertisement -