తమిళ సూపర్ స్టార్ విజయ్ – వంశీ పైడిపల్లి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో ‘వారసుడు’, తమిళ్‌లో ‘వారిసు’ అనే టైటిల్స్‌ని ఖరారు. ‘ది బాస్ రిటర్న్స్’ అనేది ట్యాగ్‌లైన్‌తో.. పూర్తిస్థాయిలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టైటిల్‌తో పాటు దళపతి విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేయగా.. వెంటవెంటనే సెకండ్ లుక్, థర్డ్ లుక్ కూడా విడుదల చేసి.. ‘వారసుడు’ టైటిల్‌ని ట్రెండ్ అయ్యేలా చేశారు మేకర్స్. ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్‌పై కీలకమైన భారీ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకి ఎంతో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.