నాగ చైతన్య, సమంత ప్రేమాయణం అంతా రహస్యంగా జరిగిందని మాత్రమే ఇప్పటి వరకు అందరికి తెలుసు. అయితే ఈ వ్యవహారంలో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. అతని వల్లే ఈ ఇద్దరి ప్రేమ పెళ్లి వరకు చేరిందట. స్వయంగా నాగచైతన్య ఈ విషయాన్ని వెల్లడించాడు. అతడెవరో కాదు చైతు బావ, దగ్గుబాటి రానా.
అక్కినేని ఫ్యామిలీకి కంటే ముందే రానాకు చైతన్య, సమంత లవ్ మ్యాటర్ తెలుసట. ఆ మధ్య చైతు ప్రేమమ్ షూటింగ్ కోసం ఫారిన్ టూర్ వెళ్లాడు. చైతు కోసం సమంత కూడా అనుమానం రాకుండా రకుల్, రెజీనాలను వెంటపెట్టుకుని మరీ చైతు దగ్గరకి వెళ్లింది. ఆ టైంలో రవితేజ, రానాలు కూడా ఈ ముగ్గురితో ఉన్నారు. అలా రానా, తన బావమరిది ప్రేమ విషయంలో ఎంతో సాయం చేశాడట.
సమంతను ఇష్టపడుతున్న విషయాన్ని కూడా రానాకే ముందుగా చెప్పాడట నాగ చైతన్య. రానా- చైతన్య కు మధ్య రిలేషన్ కంటే చిన్ననాటి స్నేహితులుగానే ఎక్కువ అనుబంధం ఉంది. ఆ చొరవతోనే రానాకు ప్రేమ విషయాన్ని చెప్పానంటున్నాడు చైతు. ఇక రానా కూడా నాగ్‌కు ఈ విషయాన్ని చెప్పి కన్విన్స్ చేసి చైతు-సమంత పెళ్లికి ఒప్పించినట్టు తెలుస్తోంది. మొత్తానికి చైతన్య, సమంత లవ్వాయణంపై ఇంత వ్యవహారం నడిచిందన్న మాట. మరీ, నాగచైతన్య పెళ్లికి ఇంత సాయం చేసిన రానా తన పెళ్లి కబురు ఎప్పుడు వినిస్తాడో చూడాలి.