మూడో రోజు బీబీసీ ఆఫీసుల్లో సోదాలు..

28
- Advertisement -

ప్రముఖ మీడియా సంస్థ బీబీసీలో మూడో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతునే ఉన్నాయి. పన్ను ఎగ‌వేత‌లు, ఆదాయ లాభాల‌ను దారి మ‌ళ్లించ‌డం లాంటి నేరాల‌కు బీబీసీ పాల్పడిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌తంలోనూ బీబీసీకి నోటిసులు ఇచ్చినా ఆ సంస్థ ప‌ట్టించుకోలేద‌ని ఐటీ అధికారులు చెబుతున్నారు.

అయితే, ప్రధాని మోదీపై డాక్యుమెంట‌రీని బీబీసీ ప్రసారం చేసిన నేప‌థ్యంలో ఆ సంస్థపై దాడులు చేస్తున్నట్లు ప్రతిప‌క్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే.గుజరాత్‌ అల్లర్ల ఘటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర ఏమిటన్నదానిపై విశ్లేషిస్తూ గత నెల బీబీసీ రెండు భాగాల డాక్యుమెంటరీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం బ్యాన్‌ చేసినప్పటికీ, అనేక విశ్వవిద్యాయాల్లో ప్రదర్శించారు.

ఢిల్లీలోని జేఎన్‌యూ, రాజస్థాన్‌లోని పలు విశ్వవిద్యాలయాల్లో ఈ ప్రదర్శనలను అడ్డుకోవడం పెద్ద దుమారాన్నే రేపింది. దేశంలో బీబీసీని బ్యాన్‌ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని కొట్టేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -