నేను సైనికుడి బిడ్డగా మాట్లాడుతున్నా..

235
- Advertisement -

సర్జికల్ స్ట్రైక్స్ లో భారత సైన్యం చూపించిన చాకచక్యానికి దేశ వ్యాప్తంగా హర్షద్వానాలు వినిపిస్తున్నాయి. అయితే దేశమంతా సైన్యం గురించి ఇంతలా పొగుడుతుంటే కొందరు పాకిస్థాన్‌ నటులను నిషేధించాలంటూ చర్చలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యాక్షన్‌ హీరో అక్షయ్ కుమార్ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోలో అక్షయ్ మాట్లాడుతూ.. నేను ఒక సెలబ్రెటీగా మాట్లాడటం లేదు, ఆర్మీ వ్యక్తి కొడుకుగా మాట్లాడుతున్నా. కొంతమంది సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించి ఆధారాలు అడుగుతుంటే, మరికొంతమంది పాక్‌ నటులను నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నారు, ఇంకొందరేమో యుద్ధం జరుగుతుందేమో అని భయపడుతున్నారని వీడియోలో పేర్కొన్నారు. భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు సంబంధించి ఆధారాలను అడగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం.

దేశ భద్రతను కాపాడే తరుణంలో 19 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా, బారాముల్లా ఉగ్రదాడిలో 24ఏళ్ల నితిన్‌ యాదవ్‌ ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. సినిమాలు ఆడతాయా లేదా? నటులపై నిషేధం విధిస్తారా లేదా? అనే ఆలోచన కాదు.. వారి భవిష్యత్తు ఏమవుతుందా అని ఆందోళన చెందుతున్నారని అన్నారు. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాల గురించి ఒక్కసారి ఆలోచించండి అంటూ ఆయన ప్రజల్ని కోరారు. పాకిస్థాన్‌ నటీనటులు, కళాకారులను నిషేధించే విషయం గురించి కాదు, సైన్యం గురించి ఆలోచించండి అని బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ హితవు పలికారు.

కాగా, యురి దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవానుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు ప్రకటించాడు అక్షయ్ కుమార్. మొత్తం 90 లక్షలను వారి ఫ్యామిలీలకు అందజేయనున్నాడు.

- Advertisement -