మొహినీ రూపంలో శ్రీవారు..

263
- Advertisement -

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు ఉదయం వేంకటేశ్వర స్వామి మొహినీ రూపంలో దంతల పల్లకిలో తిరుమాడావీధులలో విహరిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీ ఒంటరిగా విహరానికి రాదు కాబట్టి మొహినీ రూపంలోని స్వామి వెంట శ్రీ కృష్ణస్వామి మరో పల్లికిపై వస్తారు. ఉత్సవమూర్తి నిల్చున్న భంగిమలో కాకుండా దంతపు పల్లకిలో అసీనులై కనిపించడం విశేషం. స్త్రీలు ధరించే అన్ని రకాల అభరణాలను స్వామివారికి అలంకరిస్తారు.

srivaru

వరద భంగిమలో కనిపించే స్వామివారి కుడిహస్తం మొహినీ రూపంలో అభయహస్త ముద్రతో ఉంటుంది. సమస్త జగత్తు తన మాయలోనే ఉందని తనను ఆశ్రయించిన భక్తులు మాత్రమే మాయను జేయించి తనను చేరుకొగలరని మొహినీ రూపంలో స్వామివారు సందేశమిస్తున్నారు. దేవదేవుడకి జరిగే వాహనసేవలన్నిటిలోనూ అలంకరణాలు మారినప్పటికి మొహినీ అవతారంలో మాత్రం ఏలాంటి మార్పులు చేర్పులు జరగవు. శ్రీవిల్లి పూత్తూరు నుండి తీసుకొచ్చిన తమలపాకుల చిలుకలను స్వామివారి వాహనానికి అలంకరిస్తారు.

 unnamed (14)

- Advertisement -