తిమ్మాపూర్ బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్

88
- Advertisement -

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్‌ వెలిసిన తెలంగాణ తిరుపతి వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా స్వామివారికి అలంకరించారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీలు ఎంపీలు సంతోష్‌కుమార్ బీబీ పాటిల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తదితర నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌ బాన్సువాడకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ను జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. తిమ్మాపూర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువలా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలే గాక గ్రామమే ఆధ్యాత్మిక శోభను సంతరించుకొని కళకళలాడుతుంది.

ఇవి కూడా చదవండి…

జగన్ ఒంటరి పోరు.. అసలు కారణం అదే!

ప్రధానమంత్రి ముద్ర లోన్ కు.. అప్లై చేసుకోండిలా!

బి‌ఆర్‌ఎస్ కు బీజేపీకి ఉన్న తేడా అదే !

- Advertisement -