- Advertisement -
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యటించారు. హాజ్యతండా గ్రామపంచాయితీ సింగ్యాతండాకు చెందిన గిరిజన రైతులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా రైతు బంధు, రైతు భీమా అందుతున్నాయా..? అని రైతులతో ఆరా తీశారు. సీఎం కేసీఆర్ పాలన ఎలా ఉందని వారిని అడిగితెలుసుకున్నారు.
అయితే సీఎం కేసీఆర్ పాలనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ.. రైతు బంధు చెక్కులు అందాయని.. రైతుభీమా బాండ్లు వచ్చాయని తెలిపారు. అన్నదాత సంక్షేమానికి అండగా నిలిచిన కేసీఆర్‌కే తాము ఓటు వేస్తామని రైతులు స్వచ్చందంగా తెలిపారు. తమ ముగ్గురు బిడ్డలకు కళ్యాణలక్ష్మి పధకం ద్వారా సాయం అందిందని వారు హర్షం వ్యక్తం చేశారు. రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కడియం కోరగా.. కేసీఆర్‌ను గెలిపించడమే తమ బాధ్యత అని రైతులు పేర్కొన్నారు.
- Advertisement -