రికార్డులు బద్దలు కొడుతున్న ఎన్టీఆర్

176
aravinda sametha movie
- Advertisement -

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమా రిలీజ్‌ అవుతుందంటే చాలు.. ఆయన అభిమానులకు పండగే.. పండగ.. తమ అభిమాన హీరో కోసం అభిమానులు థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తారు. ఆ అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్టీఆర్‌ కూడా అదే స్థాయిలో సినిమాను హిట్‌ చేయడానికి కష్టపడతాడు. ఇటీవల ఎన్టీఆర్‌ నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపాయి. తాజాగా విడుదలైన అరవింద సమేత మూవీ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎన్టీఆర్‌ నటించిన అన్ని సినిమాల్లో కెల్లా ఈ మూవీ ఓవర్సీస్‌లో రికార్టు కలెక్షన్లతో దుమ్ములేపుతోంది.

aravinda sametha movie

ఎన్టీఆర్‌, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఓవర్సీస్‌లో రికార్డు బద్దలు కొడుతోంది. ఇప్పటికే ఈ మూవీ దాదాపు 1.7 మిలియన్‌ డాలర్ల (12 కోట్ల 50 లక్షల) వసూళ్లు సాధించింది. గ‌తంలోను ఎన్టీఆర్ న‌టించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌, జై లవ కుశ సినిమాలు కూడా 1.5 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా తాజాగా అరవింద సమేతతో మరోసారి అదే రికార్డ్‌‌ అందుకున్నాడు. ఈ ఘ‌న‌త సాధించిన తొలి తెలుగు హీరో ఎన్టీఆరే కావటం విశేషం.

ntr aravinda sametha

రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఎన్టీఆర్‌ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటికే పలు రికార్డులను క్రియేట్‌ చేసిన ఈ మూవీ టాలీవుడ్‌లో మరిన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

- Advertisement -