‘పడక సుఖం కోసం ఎవ్వరినీ వదలరు’..

207
They enter industry to sleep around Raai Laxmi
- Advertisement -

కెరీర్‌ను కష్టంతో అల్లుకోవాలి. కానీ..ఇక్కడేమో నవ్వారుతో అల్లేస్తున్నారు. ఎన్నో కలలు, ఆశలతో రంగుల లోకంలో అకాశమంత ఎత్తుకి ఎగరాలని వచ్చినోళ్లను రెండు కాళ్లపై ఎదగనివ్వక నాలుగు కోళ్ల నవ్వారుపైకి రావాల్సిందేనంటున్నారు! ఈ మాటలంటున్నది ఎవరో కాదు… రత్తాలు రాయ్‌ లక్ష్మి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకి ఆఫర్లు రావాలంటే నిర్మాత‌ల‌,ద‌ర్శ‌కుల రూమ్‌లకు వెళ్ళాల్సిందే. అలా వెళ్తేనే ఆఫర్లతో పాటు క్రేజీ ఆఫర్లు కూడా దక్కుతాయి అంటూ.. కొంతమంది హీరొయిన్లు సోషల్‌ మీడియాలో ఓపెన్‌ గా చెప్పిన మాటలే అవి.
 They enter industry to sleep around Raai Laxmi
అంతేకాదు తెలుగుసినీ ఇండస్ట్రీలో ఇలాంటి నీచమైన పనులు జరుగుతున్నాయని చాలామంది హీరోయిన్లు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. అలా లొంగ‌క‌పోతే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డిపోతుంద‌ని కూడా చెప్పారు. కొంతమంది హీరొయిన్స్‌ ఇలా ఓపెన్‌గా చెప్పడంతో..టాప్‌ హీరోయిన్స్‌కూడా ఆ విషయంపై రియాక్ట్‌ అయ్యారు. ఇదే క్రమంలో రియాక్ట్‌ అయిన  హీరోయిన్‌ రాయ్‌ లక్ష్మి.. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్‌ కౌచ్‌’ (అవకాశాల కోసం అమ్మాయిలు లైంగిక సుఖాలు అందించడం) ఉందంటూ ఓపెన్‌ గానే చెప్పేసింది.
 They enter industry to sleep around Raai Laxmi‘‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తమ్మాయిలు, హిట్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్న హీరోయిన్లను నిర్మాతలు, ఫిల్మ్‌ మేకర్స్‌ పీడిస్తున్నారు. కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ ఇండస్ట్రీకి సరాదాల కోసం, సుఖాలు అనుభవించడం కోసం (స్లీప్‌ అరౌండ్‌) వస్తారు’’ అని మొహమాటం లేకుండా ఇండస్ట్రీ తీరును ఎండగట్టింది రాయ్‌ లక్ష్మి. అంతేకాకుండా తమ సుఖాల కోసం పేరున్న ఆర్టిస్టులను కూడా వీళ్లు వదలడం లేదని, తమతో పడక పంచుకోవడానికి నిరాకరించిన ఆర్టిస్టులను కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ సినిమా నుంచి తప్పిస్తున్నారని బోల్డ్‌గా చెప్పేసిందీ. ‘కాస్టింగ్‌ కౌచ్‌’ అన్ని ఇండస్ట్రీలలోనూ ఉందన్నారు.

నిజం చెప్పాలంటే తనకెప్పుడూ అటువంటి పరిస్థితి ఎదురుకాలేదని కూడా చెప్పుకొచ్చింది రాయ్‌ లక్ష్మి.   మొన్నటికి మొన్న సీనియర్‌ హీరొయిన్‌ రమ్యకృష్ణ కూడా ఆఫర్ల కోసం అడ్జస్ట్‌ అవ్వాల్సిందే అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇలా ‘ఫిల్మ్‌ కాస్టింగ్‌ కౌచ్‌’ కి పాల్పడుతున్నది సినీ ఇండస్ర్టీలో ఉన్న బడా బాబులే అని కొందరు చెప్తున్నా..వారి పేరు మాత్రం బయటపెట్టట్లేదు. మొత్తానికి ఆఫర్లు రావాలంటే..అడిగింది ఇవ్వాల్సిందేనని రోజుకో సెలెబ్రిటి చెప్తుండడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.

- Advertisement -