తనపై తప్పుడు ప్రచారం చేస్తు తనని రాజకీయంగా నాశనం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వ విప్ పాడికౌశిక్‌రెడ్డి అన్నారు. ఈమేరకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సామాజిక వర్గానికి నిజాలు తెలియాలని…అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టు పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు. ప్రజలకు మంచి చేయాలనే నిత్యం ప్రజలతో మమేకమవుతున్నాని అన్నారు. అందుకే నాపై అనవసరపు నిందలు మోపుతున్నారని అన్నారు. ప్రజలకు సేవచేయాలనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. కులాలతో సంబంధం లేకుండా నేను రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు.
Also Read: రాహుల్ నాయకత్వంపై డౌటే ?
హూజురాబాద్ నియోజకవర్గంలో నాకు వస్తున్న ఆదరణను ఓర్వలేక నాపై కుట్రలు చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కొలేక నాపై ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఫేక్ ఆడియో ద్వారా నేను మాట్లాడకున్నా మాట్లాడినట్టు నా వాయిస్‌తో ఒక ఫేక్ ఆడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముదిరాజ్ కులస్థులకు నన్ను దూరం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. ఫేక్ ఆడియో వల్ల ముదిరాజ్‌ల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణ కోరుతున్నా. ఆ ఆడియో రికార్డ్‌ను ఫోరెన్సిక్‌కు పంపాలని డీజీపీని కలిసి కోరుతా అని అన్నారు. నాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆడియో రికార్డ్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డీజీపీకి వినతి పత్రం ఇస్తానని తెలిపారు.
Also Read: HarishRao:సుతి లేని బీజేపీ..మతి లేని కాంగ్రెస్.!