సాయిపల్లవి లేకపోతే ఫిదా లేదు !

289
There is no Fidaa without Saipallavi
There is no Fidaa without Saipallavi
- Advertisement -

కోలీవుడ్, మాలీవుడ్ ల‌లో ఉర్రూత‌లూగించిన అందాల భామ సాయి ప‌ల్ల‌వి రీసెంట్ గా ఫిదా చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు సాయి పల్లవి ఈటీవీలో వచ్చే డ్యాన్స్ ప్రోగ్రాం ఢీజోడీలో ఎంట్రీ ఇచ్చింది.. తన మెస్మరైజింగ్ పర్‌ఫామెన్స్‌తో ఢీ జడ్జీలను అప్పుడే ఫిదా చేసింది.. అప్పట్లో ఈ ప్రోగ్రాంకి ఉదయభాను యాంకర్‌గా వ్యవహరించింది. ఢీలో డ్యాన్సులు చూసిన జడ్జీలు సాయి పల్లవిని ఐశ్యర్యరాయ్‌, మాధురి దీక్షిత్ అంటూ తెగ పొగిడారు.. ఆ తరువాత పల్లవి 2015లో విడుద‌లైన ప్రేమ‌మ్ అనే మ‌ల‌యాళ చిత్రంలో మ‌ల‌ర్ గా న‌టించి అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది..

భానుమతిగా తెలంగాణ యాసలో సాయి పల్లవి నటనకు తెలుగు వారే కాదు.. ప్రవాసులు కూడా ఫిదా అయ్యారని, అందుకే ఈ చిత్రాన్ని చూసేందుకు అటు ఎన్నారైలు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు క్యూ కడుతున్నారనీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

తాను పోషించిన ‘భానుమతి’ పాత్రకి దక్కుతోన్న ప్రశంసలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పింది. తన నటన చూసినవాళ్లు సావిత్రి .. సౌందర్యలతో పోలుస్తుండటం ఎప్పటికీ మరిచిపోలేనని అంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించి ప్రేక్షకుల చేత ‘ఫిదా’ అనిపించుకుంటున్నారు. అసలు సాయిపల్లవి లేకపోతే ఫిదానే లేదనే టాక్ తెచ్చుకుంది ఈసినిమా.

https://youtu.be/FkQCPnelp0M

- Advertisement -