ధరణి వెబ్ పోస్టల్‌తో రాబంధులు పైరవీకారులు లేరు అని సీఎం కేసీఆర్ అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతర కార్యాలయ శిలా ఫలకాన్ని ప్రారంభించారు. అలాగే జిల్లా సమీకృత కార్యాలయంను ప్రారంభించారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంను ఏర్పాటు చేసి…ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు.
ప్రజల కోసం పనిచేయని వారు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారు. వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గతంలో వడ్లు అమ్మితే పైసలు వచ్చేందుకు నెలలు పట్టేది. రైస్‌మిల్లు సేట్ల చుట్టూ తిరిగే పరిస్థితులుండేవి. కానీ ఇప్పుడు గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నామని అన్నారు. పైసలు సక్కగా వచ్చి బ్యాంకుల్లో పడుతున్నాయి. ధరణి ఉంది కాబట్టి రాబంధులు లేరు అని అన్నారు. పైరవీకారులు లేరు. పట్వారీలు లేరు. ఇవాళ పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఐదు నిమిషాల్లో పట్టా అయిపోతుంది. ఇదంతా ధరణి ఉండటం వల్లే సాధ్యమైంది. దీన్ని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని మండిపడ్డారు.
Also Read: జోగులాంబ గద్వాలకు సీఎం కేసీఆర్..
గద్వాల్‌లో గతంలో గతంలో ఎండిపోయి, ఇబ్బందిపడ్డ పాలమూరులో ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ధాన్యపు రాశులు, కళ్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వేస్టర్లతో కళకళలాడుతున్నది. కరెంటు, రైతుబంధు, దళితబంధు రావాలంటే బ్రహ్మాండంగా బీఆర్‌ఎస్ పార్టీని కాపాడుకోవాలి’ అంటూ సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read: కోమటిరెడ్డితో జూపల్లి భేటీ..