- Advertisement -
కాంగ్రెస్ నేత మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లోంచి రూ.2 లక్షలు మాయమయ్యాయని చిరంజీవి మేనేజర్ గంగాధర్ ఈ రోజు హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తే ఈ చోరీకి పాల్పడినట్లు చెప్పారు. ఈ చోరీ తరువాత ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు.
దర్యాప్తులో భాగంగా చిరంజీవి ఇంటి పనిమనిషి చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిరు ఇంట్లో చెన్నయ్య కొంతకాలంగా సర్వర్‌గా పనిచేస్తున్నాడు. ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్‌లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి తన 151వ చిత్రం పనిలో బిజీగా ఉన్నారు.
- Advertisement -