నల్లగొండపై గులాబీ జెండా ఎగరేస్తాం..

298
No TDP-No Cong in TS: KTR
- Advertisement -

సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో టీఆర్ఎస్‌లోకి వలసలు కొనసాగుతునే ఉన్నాయి. తెలంగాణ భవన్‌లో  మంత్రులు కేటీఆర్,ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి సమక్షంలో  టీడీపీ నేతలు కంచర్ల భూపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. భూపాల్‌రెడ్డిని నల్లగొండ టీఆర్ఎస్ ఇంచార్జీగా నియమిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో నల్లగొండలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ప్రజలు గెలిపించారని గర్తుచేశారు.

తెలంగాణలో టీడీపీ చచ్చిపోయింది కాబట్టే కంచర్ల టీఆర్ఎస్‌లో చేరారని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గెలుపుతోనే టీడీపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. దేశానికి,రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్‌ అని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా నుంచి ఎంతోమంది కాంగ్రెస్ నేతలు మంత్రులుగా పనిచేసినా ఫ్లోరైడ్‌ని తరిమికొట్టలేకపోయరని మండిపడ్డారు.

1953 నుంచి నేటి వరకు తెలంగాణను అడ్డకుంది….నేడు అభివృద్ధికి అడ్డుపడుతుంది కాంగ్రెస్‌ పార్టీ నేతలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చిత్తూరు జిల్లాకు తాగునీటి కోసం రూ. 9 వేల కోట్ల ఖర్చుచేస్తే…ఫ్లోరైడ్‌తో అల్లాడుతున్న నల్లగొండ జిల్లాకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని ..అదే కేబినెట్లో మంత్రులుగా జానా, ఉత్తమ్‌లు ఉన్నారని గుర్తుచేశారు. కంచర్ల భూపాల్‌ రెడ్డితో వివిధ పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు వేలాదిమంది టీఆర్ఎస్‌లో చేరారు.

- Advertisement -